విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘గార్డ్’. రివెంజ్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్. అను ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనసూయ రెడ్డి నిర్మాణంలో జగ పెద్ది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శిల్పా బాలకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాలో తెరకెక్కించిన ఈ గార్డ్ సినిమా నేడు ఫిబ్రవరి 28న విడుదల అయింది.
కథ విషయానికొస్తే.. ఈ కథ అంతా ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన సుశాంత్(విరాజ్ రెడ్డి) సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ డాక్టర్ సామ్(మిమీ లియానార్డ్)తో ప్రేమలో పడతాడు. సుశాంత్ పనిచేసే హాస్పిటల్ బేస్మెంట్ లో ఎప్పుడూ ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తనని కూడా అక్కడకు తీసుకెళ్లమని సామ్ అడగడంతో తీసుకెళ్తాడు.
అనుకోకుండా సామ్ అక్కడ ఎవ్వరూ ఓపెన్ చేయని ఓ రూమ్ కి వెళ్లడంతో ఆమెలోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. దీంతో ఆ ఆత్మ సామ్ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ సుశాంత్ ని, అతని ఫ్రెండ్ ని భయపెడుతుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ కథ ఏంటి? సుశాంత్ కి ఆ ఆత్మకు సంబంధం ఏంటి? ఇతను చేసే సెక్యూరిటీ గార్డ్ పనితో అతను ఏం చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. ఇది ఒక డిఫరెంట్ ప్లాట్ తో తెరకెక్కింది. చనిపోయిన ఓ అమ్మాయి ఆత్మగా తిరిగొచ్చి తన పగను తీర్చుకోవడం అనేది మెయిన్ ప్లాట్. దానికి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని తెరకెక్కించారు. కథనంలో కొత్తదనం చూపించారు. ఆస్ట్రేలియాలో కథ జరగడం, అక్కడ గార్డ్ గా పనిచేసే హీరోతో కొత్తగా భయపెట్టడానికి ట్రై చేసారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ పాత్రల పరిచయం, వారి ప్రేమతో సాగుతుంది. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంటర్వెల్ కి ఆత్మ సామ్ లోకి దూరడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంటుంది. ఆ తరువాత అంత ప్రేక్షకులకి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో ఆ ఆత్మ ఏం చేసింది? తనని చంపింది ఎవరు? తన స్టోరీ ఏంటి? హీరో ఆ ఆత్మకు ఎలా సపోర్ట్ చేసాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. సినిమా అంతా హారర్ ఎలిమెంట్స్ తో బాగా భయపెట్టారు. హీరో – హీరోయిన్ ప్రేమ కథ ఎంగేజింగ్ గా వుంటుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ తో నవ్వించే ప్రయత్నం చేసారు. క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం. కథ అంతా ఆస్ట్రేలియాలో జరగడం వల్ల అక్కడ నేటివిటీ ఎక్కువుగా కనిపిస్తుంది. ఎక్కువగా ఇంగ్లీష్ డైలాగ్స్ ఉండటంతో యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. విరాజ్ రెడ్డి చీలం కొత్తవాడైనా బాగా చేసాడు. మిమీ లియానార్డ్ అందాలు ఆరబోస్తూనే దయ్యం పట్టిన పాత్రలో బాగా నటించింది. శిల్ప బాలకృష్ణన్ కూడా తన నటనతో మెప్పించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు అక్కడక్కడా నవ్వించాడు. నెగిటివ్ షేడ్స్ లో కమల్ కృష్ణ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో నటించి మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాగా భయపెట్టారు. ఉన్న ఒక్క పాట కూడా బాగుంది. కథ… కథనం కొత్తగా చూపించి భయపెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత ఖర్చుపెట్టారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా క్వాలిటీ గా నిర్మించాడు. గార్డ్… ఎంగేజింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లిర్. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3.25
The post Garud Movie Review: Scares Everyone (Rating: 3.25) appeared first on Social News XYZ.