counter stats PM Modi participates in ‘What India Thinks Today’ summit – open Dazem

PM Modi participates in ‘What India Thinks Today’ summit

వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో పాల్గొన్న నరేంద్ర మోదీ

PM Modi participates in 'What India Thinks Today' summit

భారతదేశంలో అతిపెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ నైన్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీకి మై హోం గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు, ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగించారు.

దేశం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది – మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు

మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక పురోగతి ప్రయత్నాల గురించి వివరించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ డేటా ప్రకారం రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ప్రపంచ‌మంతా భారత్‌ వైపు చూస్తోందన్నారు. పీఎం గతి శక్తి, స్టార్టప్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి వాటిలో మార్పునకు దారితీస్తుయ‌ని చెప్పారు. డిజిటల్ ఇండియాలో చూపిస్తున్న చొరవ అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఆదర్శంగా మారుతోందని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని కొనియాడారు. డిజిటల్ ఇండియా దార్శనికత దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక మార్గదర్శి పాత్రను పోషిస్తోందని, 1.45 బిలియన్ల భారతీయుల ఆకాంక్షలకు బలమైన దిశానిర్దేశం చేయడం, ప్రపంచ వృద్ధికి భారతదేశం ప్రధానంగా మారడం ద్వారా తాను ఎంతో ప్రేరణ పొందానని తెలిపారు.

వాట్ ఇండియా థింక్స్ టుడే వినూత్న కార్య‌క్ర‌మం – ప్ర‌ధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రపంచం దృష్టంతా నేడు భారత్‌పై ఉందన్నారు. ప్రపంచంలోని ప్రతీ దేశ పౌరుడు ఒక జిజ్ఞాసతో భారత్‌ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో సమకాలీన రాజకీయాలతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు. భార‌త‌దేశ ఆలోచ‌న‌ల గురించి యావత్‌ ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని పేర్కొన్నారు. గతాన్ని, వర్తమానాన్ని పోల్చుతూ అనేక అంశాలను ప్రధాని ఉదహరించారు. వాట్‌ ఇండియా థింక్స్ టుడే ఒక వినూత్నమైన, అద్భుతమైన కార్యక్రమం అని, ఇతర చాన‌ళ్ల‌కు కూడా ఎంతో ప్రేర‌ణ ఇచ్చే విధంగా ఉంద‌ని మోదీ అభినందించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీవీనైన్‌ నెట్‌వర్క్ ను ప్రధాని మోదీ ప్ర‌శంసించారు.

PM Modi participates in 'What India Thinks Today' summit

The post PM Modi participates in ‘What India Thinks Today’ summit appeared first on Social News XYZ.

About admin